ప్రకటనలు చదవడం ద్వారా మీ రీచార్జ్ చేసుకోండి

links

21, సెప్టెంబర్ 2012, శుక్రవారం

సింహం-కుందేలు


సింహం-కుందేలు


అరణ్యంలో ఎన్నో రకాల జంతువులు నివసిస్తున్నాయి. అన్నింటికి రాజు సింహం.  అది చాల పౌరుషము కలది. తన పంతం చెల్లాలనే పట్టుదల కలది. పై పెచ్చు క్రూర స్వభావమున్నది. అందుచేత అది ఆడింది ఆటగా, పాడింది పాటగా సాగుతోంది. అది ఇష్టము వచ్చినట్లు వేటాడి జంతువుల్ని చంపి తినేది. జంతువుల శవాల్ని పోగులు పెట్టేది. ఆ సింహం వేటకు బయలుదేరితే జంతువులన్నీ ప్రాణరక్షణ కోసం పరుగు తీసేవి. సింహం ఇష్టం వచ్చినట్లు చంపటం వల్ల అన్నీ కలిసి ఆలోచించి రోజుకు ఒకరు చొప్పున ఆహారంగా వెళ్ళాలని తీర్మానించుకుని, సింహానికి తెలియజేయగా సింహం అంగీకరించింది.

కష్టపడకుండా నోటి దగ్గరికి ఆహారము రావటంవలన దానికి బాగానే ఉంది. జంతువులు తమ వంతు ప్రకారము ఆహారముగా వెళుతున్నాయి. చిన్న కుందేలు వంతు వచ్చింది. మూడు సంవత్సరాలు నిండిన తనకి అప్పుడే ఆయుర్దాయము చెల్లిపోయిందని బాధపడింది. అయితే కుందేలు మిగతా జంతువుల వలె గాక తెలివిగలది, ఆలోచించగలిగింది. ఉపాయముతో అపాయము తప్పించుకోవాలని ఆలోచించసాగింది. దానికి ఉపాయము తోచింది. వెంటనే ఆచరణలో పెట్టింది. సింహం దగ్గరకు ఆలస్యంగా వెళ్ళింది. సింహం వేళ దాటి పోతున్నందున కుందేలు పై మండిపడి ‘ఇంత ఆలస్యము ఎందుకు జరిగింది?’ అని భయంకరంగా గర్జించింది. అప్పుడు కుందేలు వినయం, భయం, భక్తితో నమస్కరించి ఇలా అంది.

“మహారాజా! నేను మామూలు వేళకు బయలు దేరాను దారిలో మరో సింహం కనిపించి నన్ను నిలదీసి గర్జించింది. తానే ఈ అడవికి మహారాజు, మరొకడు రాజు కాడు అని నన్ను తనకు ఆహారము కమ్మన్నది. నేను అతి కష్టము మీద ఒప్పించి మీ దర్శనము చేసుకుని తిరిగి వస్తానని చెప్పి వచ్చాను.

“ప్రభూ! ఆ సింహం మిమ్మల్ని ఎంతగానో దూషించింది. మీకు పౌరుషం లేదన్నది గాజులు వేసుకోమని” చెప్పింది. మిమ్మల్ని వెక్కిరించింది. ఈ మాటలు చెప్పి కుందేలు సింహం వైపు చూసింది అప్పటికే సింహానికి విపరీతమైన కోపం వచ్చింది. వెంటనే కోపంగా “నేనే ఈ అడవికి రాజుని”  ఎక్కడో చూపించు దానిని  నా పంజాతో కొట్టి చంపేస్తా” నంటూ ఆవేశముగా కుందేలు వెంట నడిచింది. కుందేలుని తొందర చేసి బయలుదేరిన వారిరువురు పాడు బడిన బావి దగ్గరకు వచ్చారు. శత్రుసింహానికై వెదక సాగింది. ఇక ఆలస్యం చేయక కుందేలు ఇలా చెప్పింది. “మహారాజా! మిమ్మల్ని వెక్కిరించి, దూషించిన సింహం ఆనూతిలో ఉంది. వెళ్ళి చంపండి”. అంది.

కుందేలు మాటలకి సింహం గర్జించి నూతి గట్టుపైకి దూకి లోపలి చూసింది ఈ సింహం గర్జించగానే ఆ సింహం గర్జించింది. ఈ సింహం పంజా పై కెత్తగానే ఆ సింహం పంజా పైకెత్తింది ఈ సింహం ఏంచేస్తే అది అలా చేయసాగింది. సింహానికి కోపం ఎక్కువై నూతి గట్టు మీద నుండి నూతిలోకి దూకింది అంతే నీటిలో మునిగి చచ్చిపోయింది. ఆ నూతి నీటిలో తన నీడ పడి మరో సింహంలా కనిపించిందని కోపముతో ఉన్న అడవి రాజు పసికట్ట లేక పోయింది. కుందేలు పన్నిన ఉపాయం వలలో చిక్కుకుని సింహం చచ్చిపోయింది. అపాయానికి ఉపాయము ఉపయోగించి ప్రాణాలు కాపాడుకుంది చిన్న కుందేలు.

ఉపాయంతో అపాయాన్ని తప్పించుకోవచ్చు


ఉపాయంతో అపాయాన్ని తప్పించుకోవచ్చు 
అనగనగా ఒక ఊళ్ళో పేదరాశి పెద్దమ్మ ఉండేది. ఆ పెద్దమ్మకు నలుగురు కూతుళ్ళు ,  కూతుళ్ళు పెద్దవాళ్ళు అయ్యారు.  వారికి మంచిగా పెళ్ళిళ్ళు చేసింది. తను దాచుకున్నవి తలోకాస్త ఇచ్చి వేసింది. తన వద్ద మిగిలింది ఏమీ లేదు. తాను బతకాలి కదా! కనుక ఒక్కో కూతురి ఇంట మూడు మాసాలు ఉంటుంది. అల్లుళ్ళు మంచివాళ్ళు దొరికారు. అత్తగారిని బాగా చూసుకుంటారు. ఇలా చాలా కాలం గడిచింది. ఈ ఏర్పాటు బాగానే ఉంది. పెద్దమ్మకు వంట వార్పు పని లేదు. హాయిగా గడచిపోతూంది. ఒకసారి పెద్దమ్మ కూతురు ఇంట్లో మూడు మాసాలు ఉంది. పెద్ద కూతురు అన్నీ వండి పెట్టింది. హుషారుగా ఉంది పెద్దమ్మ. ఒక రోజు రెండవ కూతురు ఇంటికి బయలు దేరింది. కొంత దూరం సాగింది. మధ్యలో అడవి వచ్చింది. అడవి గుండా నడిచి వెళ్ళాలి. పెద్దమ్మ చక చకా నడవసాగింది. అడవి మధ్యకు చేరింది. ఆ అడవిలో ఒక పులి ఉంది. నరవాసన పట్టింది. పెద్దమ్మను సమీపించింది. నిన్ను తినేస్తాను – అంది పులి పెద్దమ్మతో. పెద్దమ్మకు భయం వేసింది.

చెమటలు పట్టాయి. పెద్దమ్మ తెలివైనది. యుక్తి గలది. కాస్త ఆలోచించింది. పులితో ఇలా అంది. పెద్ద పులీ! పెద్ద పులీ! నేను ముసలదాన్నయాను. బాగా చిక్కిపోయాను. ఆరోగ్యం బాగాలేదు. ఇప్పుడు రెండో కూతురు ఇంటికి వెళుతున్నాను. వాళ్ళు  బాగా ఉన్నోళ్ళు . అక్కడ పది రోజులు ఉంటాను. రెండవ అమ్మాయి చాలా మంచిది. నా కోసం గారెలు చేస్తుంది. సున్ని ఉండలు చేసి పెడుతుంది. అరిసెలు చేస్తుంది. అన్నీ తింటాను. ఒళ్ళు చేస్తాను. బలిసి వస్తాను. అప్పుడు తిందువుగాని – అంది పెద్దమ్మ. పెద్దపులి పెద్దమ్మ మాటలు నమ్మింది. పెద్దమ్మను పులి అప్పటికి వదిలి పెట్టింది. పెద్దమ్మ రెండవ కూతురు ఇంటికి వెళ్ళింది. పది రోజులు అయ్యింది. పదిహేను రోజులు దాటింది. నెల పూర్తయింది. పెద్దమ్మ మరలా అడవిన రాలేదు. ఎలాగైనా రాకపోతుందా! ఇదే దారి కదా. అప్పుడు పడతా పెద్దమ్మ పని – అని కాచుకొని కూచుంది పులి. పెద్దమ్మ మూడు నెలలు అచట గడిపింది. ఇక బయలుదేర వలసిన పరిస్థితి ఏర్పడింది. అది ఒప్పందం కదా.

బయలు దేరే రోజు దగ్గర పడింది. పెద్దమ్మ రెండవ కూతురిని పిలిచింది. పులితో జరిగిన గొడవ చెప్పింది. పెద్దమ్మ కూతురూ తెలివైనదే. అమ్మను కాపాడాలి. బాగా ఆలోచించింది. ఒక పెద్ద బాన తెచ్చింది. బానలో పెద్దమ్మను కూచో పెట్టింది. మూత పెట్టింది. మూతకు గుడ్డ కట్టింది. దొర్లించి వదిలి పెట్టింది. బాన దొర్లుతూ  అడవినబడి పోతాఉంది. బానలోని ముసలమ్మ హుషారుగా ఉంది. పులి నన్నేమీ చేయలేదు – అనుకుంది. “బానా బానా దొర్లు,దొర్లు” అంటూ పాడుకుంటుంది. బాన అడవి మధ్యకు చేరింది. పులి సమీపించింది. పులికి బానలో పాట వినిపించింది. పులికి ఎక్కడలేని కోపం వచ్చింది. బానను కాలితో ఆపింది. పంజాతో గట్టి దెబ్బ కొట్టింది. బాన ఢాం అని పగిలిపోయింది. ముక్కలయింది. పెద్దమ్మ బయటపడింది. భయం వేసింది. నిన్ను ఇప్పుడే తింటాను – అని పులి కేక వేసింది. పెద్దమ్మకు వణుకు పుట్టింది. అయినా ధైర్యం తెచ్చుకుంది. మళ్ళీ కాస్త ఆలోచించి పెద్ద పులీ! పెద్దపులీ!ప్రయాణంలో ఒళ్ళంతా చెమట పట్టింది. నీరసంగా ఉంది. అలసిపోయాను. పక్కనే చెరువు ఉంది. ఆ చెరువులో  స్నానం చేసి వస్తాను. అపుడు హాయిగా తిందువుగాని – అంది పెద్దమ్మ. పులి “సరే” అని వదిలి పెట్టింది.

పెద్దమ్మ చెరువులోకి దిగింది. స్నానం చేసింది. బయటకు రాలేదు. గంట అయ్యింది. రెండు గంటలు అయింది. పులికి కోపం వచ్చింది. ఆకలి పెరిగింది. పులి చెరువు ఒడ్డున నిలబడి పెద్దమ్మను పిలిచింది. పెద్దమ్మ పులి మాటలు విన్నది. కాని పట్టించుకోలేదు. ఏమైనా పులి పెద్దమ్మను తినేయాలనుకుంది. పులి చెరువులో దిగింది. పెద్దమ్మను సమీపించింది. పెద్దగా అరిచింది. పెద్దమ్మను చంపేయాలనుకుంది. పంజా ఎత్తింది. పెద్దమ్మ తక్కువదా! ముందే ఆలోచించింది. రెండు గుప్పెట్ల నిండా ఇసుక తీసుకుంది. పులి మీదకు రాగానే పులి కంట్లో ఇసుక చల్లింది. పులి కళ్ళు కనబడలేదు. కేకలు పెట్టింది. చెరువులోనే గిలగిల తన్నుకుంది. ఈలోగా పెద్దమ్మ ఒడ్డుకు చేరుకుంది. అడవిలో నడిచింది. మూడవ కూతురు ఇంటికి చేరుకుంది.

అహంకారం లేదా గర్వం అనేవి పతనానికి నాంది


అహంకారం లేదా గర్వం అనేవి పతనానికి నాంది
చీమలు దూరని చిట్టడవిలో ఓ సింహం ఉంటూ ఉండేది.  సహజంగానే బలపరాక్రమాలున్న జంతువు.  మంటకు గాలి తోడైనట్లు సింహానికి అంతులేని అహంకారము ఉంది.  అడవిలో బ్రతికే తదితర మృగాలన్నిటి చేతా అడ్డమైన చాకిరీ చేయించేది.  సింహం ఆడిందే ఆట, పాడిందే పాట.  ఇలా ఉండగా చిట్టడవికి చెప్పలేనంత కరువొచ్చింది.  ఆ కరువుకి తట్టుకోలేక మృగాలన్నీ తలో దోవా పారిపోయాయి.  మృగాలకి రాజయితే మాత్రం సింహానికి తిండితిప్పలు ఎక్కడివి? బెట్టుగా అక్కడే కొన్నాళ్ళ పాటు నీల్గుతూ ఉంది.  కాని, అది ఆఖరికి కాకులు దూరని కారడవికి ప్రయాణమై వెళ్ళింది. కాకులు దూరని కారడవిలో ఓ నక్కా, గాడిదా, ఎద్దూ, మంచి స్నేహంగా నివాసముంటున్నాయి.  వాటి వాటి తిండితిప్పలు వేరయినా కలసిమెలసి ఉంటున్నాయి.

సింహం అక్కడికి చేరింది. తాను వలస వచ్చినా గర్వాన్ని వదలలేదు.  కాకులు దూరని కారడవికి తానే రాజునని అంది. నక్కా, ఎద్దు, గాడిద – మూడింటితోనూ ఒక ఒడంబడికకు వచ్చింది.  అందరూ కలిసి ఆహారాన్ని సంపాదించాయి.  సింహం ఒక పక్క, తతిమ్మా జంతువులు ఒక పక్క కూచున్నాయి.  సింహం ఎద్దు వేపు చూసి ‘ఎలా పంచిపెడతావో పంచిపెట్టూ’ అని అంది.  ఆహారాన్ని నలుగురికి నాలుగు సమాన వాటాలు వేసింది ఎద్దు. సింహానికి కోపం వచ్చింది.  ఎద్దు మీదకు దూకి పంజాతో చరిచింది.  ఎద్దు చచ్చిపోయింది.  నక్కా, గాడిదా లోలోపలే ఏడ్చాయి.

సింహం నక్క వైపు తిరిగి ఈ సారి నువ్వు పంచూ అని అంది.  నక్క తెలివిగలది.  చప్పున దండం పెట్టి ఆహారాన్ని పంచడం నాకు చేత కాదు! అని అంది. సింహం గర్వానికి అంతు లేకుండా పోయింది.  ‘సరే! నేనే పంచుతాను’ అని ఆహారాన్ని మూడు వాటాలు చేసి ఇలా అంది :

‘నేను మృగరాజుని కనక ఒక వాటా నాది రెండోవాటా మీతో పంచుకోవాలి కనక నాది!’  అని అంటూ మూడో వాటా కాలు నొక్కి పెట్టి,  ‘దమ్ములుంటే మూడో వాటా తీసుకోండి!’ అని అంది.  కాని సింహం కాలి కింద ఆహారాన్ని లాక్కోడానికి ధైర్యం ఎవరికుంది?  ఇలా దౌర్జన్యంగా మొత్తం ఆహారాన్ని సింహం కాజేసింది. తతిమ్మా జంతువులు ఆకలితో నకనకలాడాయి.  ఐతే, సింహం ఒక్కటే ఆత్రంకొద్దీ ఆహారాన్ని మింగింది. ఎద్దుని చంపింది కదూ? దాన్ని కూడా మెక్కింది. తిండికి చిట్టడవిలో మొగం వాచిందో ఏమో, దొరికిందే చాలనుకుని తెగతిన్నది.

సింహానికి జబ్బుచేసింది. చేయదూ మరి! ఆ జబ్బు ముదిరి చచ్చేస్ధితికి వచ్చింది. ఇన్నాళ్ళు సింహంవల్ల బాధపడిన జంతువులు వచ్చి, కసిదీరా సింహాన్ని తిట్టి, తన్ని పోతున్నాయి. సింహం లేవలేకపోయినా గ్రుడ్లురిమి చూచి మూలిగేది.  కాని, ఏ ప్రాణీ భయపడేది కాదు.  ‘బ్రతికి బాగుంటే పగదీర్చుకుంటా’ ననేది.  గ్రుడ్లురిమి చూడ్డంవల్ల కొన్ని జంతువులు యింకా భయపడుతున్నాయి.

ఓ రోజున గాడిద వచ్చింది. ‘నీవుకూడా తన్నిపోవడానికే వచ్చావా?’ అని గ్రుడ్లురిమి చూసింది సింహం.  ‘ఇంకా గ్రుడ్లురుముతున్నావా మృగరాజా!  చింత చచ్చినా పులుపు చావలేదే!’ అంది గాడిద.  సింహం మళ్ళా గ్రుడ్లురిమి చూసింది.  గాడిద మళ్ళీ మాటాడకుండా వెనక్కి తిరిగింది.  సింహం మొగాన్ని గురిచూసి వెనక కాళ్ళతో ఫెడీ ఫెడీ తన్నింది.  దాంతో సింహం రెండు కళ్ళూ రాలిపడ్డాయి.

‘ఇంత బతుకూ బతికి, ఆఖరికి గాడిద చేత కూడా తన్నులు తిని చావవలసి వచ్చింది.  అయ్యో! నాదెంత దిక్కుమాలిన చావు?’ అని ఏడ్చింది సింహం.  కాని ఎవరికి జాలి?

నీతి:  అహంకారం లేదా గర్వం అనేవి పతనానికి నాంది

ఐకమత్యమే మహా బలం


ఐకమత్యమే మహా బలం

పూర్వకాలం ఉజ్జయినీ నగరంలో ఒక వర్తకుడు ఉండేవాడు.  అతను చాలా తెలివిగా వ్యాపారం చేస్తూ బాగా డబ్బు, పేరు సంపాదించుకున్నాడు.  అన్నీ ఉన్నా అతనికి ఉన్న దిగులు ఒక్కటే.  అది తన పిల్లల గురించే. అతని నలుగురు పిల్లలు పుట్టటంతోనే ధనవంతులు కావడం వల్ల అల్లారు ముద్దుగా పెరిగారు. ఎవరికీ చదువు అబ్బలేదు. ఇతరులు అంటే నిర్లక్ష్యం.  లోకజ్ఞానం లేదు. పైగా ఒకరంటే ఒకరికి పడదు.  వారికి వయస్సు పైబడుతున్నా ఏమాత్రం మార్పు రావడంలేదు. కొంత కాలానికి షావుకారికి జబ్బు చేసింది.  చనిపోతానేమోనని బెంగపట్టుకుంది.  తను చనిపోతే తన పిల్లలు ఎలా బ్రతుకుతారా అని దిగులుతో వ్యాధి మరింత ఎక్కువైంది. బాగా ఆలోచించగా అతని ఒక మెరుపు లాంటి ఆలోచన వచ్చింది.

నలుగురు కొడుకులను పిలిచి వాళ్ళతో కొన్ని కట్టెలు తెప్పించాడు.  ఒక్కొక్కడిని ఒక్కొక్క కట్టె తీసుకొని విరవమన్నాడు.  నలుగురు తలో కట్టెను తీసుకుని సునాయాసంగా మధ్యకు విరిచేసారు. తరువాత ఒకేసారి రెండేసి కట్టెలను విరవమన్నాడు.  ఆ నలుగురు వాటిని కష్టం మీద విరిచారు. తరువాత ఒక్కొక్కరినీ నాలుగేసి కట్టెలు తీసుకుని విరవమన్నాడు షావుకారు.  నాలుగేసి కట్టెలు విరవడం ఏ ఒక్కరి వల్లనా సాధ్యం కాలేదు. అవే నాలుగు కట్టెలను నలుగురిని పట్టుకుని విరవమన్నాడు.నలుగురూ కలిసి నాలుగు కట్టెలను నునాయాసంగా విరిచేశారు. చూశారా మీరు కలిసి కట్టుగా ఒక పని చెయ్యగలిగారు.  ఎవరికి వారు చేయలేకపోయారు.  “ఐకమత్యమేబలం” కాబట్టి నా తదనంతరం మీరు ఐకమత్యంగా ఉంటామని ప్రమాణం చేయండి అన్నాడు తండ్రి.  నలుగురూ తండ్రి మాటల్లోని సత్యాన్ని గ్రహించి అలాగేనని తండ్రికి ప్రమాణం చేశారు.

నీతి:  ఐకమత్యమే మహా బలం

తోడేలు మోసం - ఒంటె ఉపాయం


తోడేలు మోసం - ఒంటె ఉపాయం 
అనగనగా ఒక అడవి ఉంది.  ఆ అడవి పక్కన ఒకపల్లె ఉంది. ఆ అడవిలో ఒక తోడేలు ఉంది.  అది బాగా జిత్తులమారిది.  అది ఎప్పుడూ ఎదుటి జంతువులని మోసం చేస్తూ ఉండేది.  పెద్ద జంతువులు కూడా దాని వలన మోసగింపబడేవి.  అది జిత్తులమారిది అని అన్నిటికీ తెలుసు.  తోడేలుతో అందుకనే జంతువులన్నీ కూడా జాగ్రత్తగా ఉండేవి.  “ఆ పల్లెలో ఒక ఒంటె ఉండేది. తోడేలు ఒంటెను ఒకసారి చూసింది.  ఒంటెను ఎలాగైనా మోసం చేయాలనుకుంది.  ఒకరోజు తోడేలు ఒంటె దగ్గరకు చేరింది.  ఒంటెతో ఇలా అంది. మామా నన్ను ఎవరూ నమ్మటంలేదు.  నన్ను దగ్గరకు రానీయటంలేదు. నేను ఒంటరి దానను అయినాను మన ఇద్దరం కలిసి స్నేహంగా ఉందాం” అని అంది.  ఆ మాటలకు ఒంటె తనలో తాను ఇలా అనుకుంది.  ఈ తోడేలు చాలా జిత్తులమారింది.  ఇది ఎన్నో జంతువులను మోసం చేసింది.  దీని మాటలు అసలు నమ్మకూడదు.  ఇది నన్ను కూడా మోసం చేస్తుంది.  అందుకని దీని వలలో పడకూడదు.  కాని పైకి ఇలా అంది “నేను నమ్మను.  నీది బాగా చెడు బుద్ది.  చాలా జంతువులను మోసం చేశావు.  అదీకాక నీవు మాంసాహారివి. నేను శాకాహారిని నీతో నాకు స్నేహం వద్దు” అంది.

 అది విని తోడేలు ఒంటెను బ్రతిమిలాడి ఇలా అంది, “మామా! నేను ఇపుడు చాలా మారాను.  అసలు మాంసాహారము ముట్టడం లేదు.  నేను శాకాహారమునే తీసుకుంటున్నాను.  నేను నీలాంటి పెద్దవాళ్ళతో స్నేహం చేయాలనుకుంటున్నాను.  నా భార్యాపిల్లలకి అడవిలో సరైన ఇల్లువాకిలి లేదు.  నా భార్యాపిల్లలు కూడా శాకాహారులుగా మారారు.  నన్ను నమ్ము.  నువ్వు ఎలా చెబితే అలా వుంటాను.  అదీకాక ఈ పల్లెలో నీకు మంచి ఆహారం దొరకటం లేదు.  మంచి ఆహారము దొరికే చోటు నేను నీకు చూపిస్తాను.  అచట నీకు కావలసిన ఆహారము ఎంతైనా తినవచ్చును.  ఆహారము దొరికే చోట్లు అన్నీ నీకు చూపిస్తాను. అని బాగా నమ్మకంగా చెప్పినది.  ఈ మాటలు ఒంటె బాగా నమ్మింది. తోడేలుతో ఇలా అంది.  “నీవు నన్ను మోసము చేయవు కదా! ఏదైనా ప్రమాదం జరిగితే నీలాగా పరుగులు తీయలేను”.

అందుకే తోడేలు “నిన్ను వదలి నేను ఎక్కడికి వెళ్ళను.  మనము కలిసి తిరుగుదాం. కలిసి ఆహారం తిసుకుందాం.  కలిసి ఆడుకుందాం నన్ను నమ్ము అంది. ఈ మాటలను ఒంటె బాగా నమ్మింది. ఆ రోజు నుంచి ఒంటె, తోడేలు కలిసి తిరిగేవి. కలిసి ఆహారము దొరికే చోటికి వెళ్ళేవి.  ఇలా కొన్ని రోజులు గడిచినాయి. ఒంటె తోడేలును బాగా నమ్మింది. తోడేలు యేమి చెబితే ఒంటె ఆ పని చేయసాగింది.  ఒంటె ఉన్న పల్లె దగ్గరలో చిన్ననది ఉంది.  ఆ నదిలో నీరు ఎపుడూ నిండుగా ఉంటుంది. ఆ నది అవతల ఒడ్డున చెఱుకు తోటలు ఉన్నాయి. ఒకరోజున అవి తోడేలు చూసింది.  వెంటనే తోడేలుకు ఒక చెడు ఆలోచన వచ్చింది. ఒంటెను ఏడ్పించాలంటే ఇదే సమయం అనుకుంది. దానికి ఒక పథకము ఆలోచించింది.

 ఒకరోజు తోడేలు ఒంటెతో “మామా! మనము చాలా రోజుల నుంచి ఒకే ఆహారము తింటున్నాము. చెఱుకు గడలను తినాలని ఉంది.  నదికి అవతల మంచి చెఱుకు తోటలు ఉన్నాయి. రేపు అవతలకు వెళ్ళి,  చెఱుకు గడలు తినివద్దాం. అవి నీకు కూడా ఇష్టమే కదా!” అని అంది. ఒంటె ఒప్పుకుంది.  తోడేలు దానిని నది ఒడ్డుకు తీసుకువెళ్ళింది.  ఒంటె కూడా నది ఇవతల నుంచి ఆ చెఱుకు చేనును చూసింది.  ఒంటెకు నోరు ఊరింది.  చెఱుకు గడలు ఎలాగయినా తినాలనుకుంది. ఒంటె, తోడేలు కలిసి నది దాటటానికి పథకం వేశాయి.  మరునాడు ఒంటె, తోడేలు నది ఒడ్డుకు చేరినాయి. తోడేలు నదిని చూసి భయపడింది. దానికి ఈతరాదు. ఆమాటే ఒంటెతో అంది.  ఒంటెకు ఉత్సాహంగా ఉంది.  దానికి చెఱుకు గడలే కంటికి కనబడుతున్నాయి. అది తోడేలు వైపు తిరిగి “నీవు నా వీపు మీద కూర్చో”అంది.  తోడేలు వెంటనే ఒంటె వీపు మీద కూర్చుంది.  రెండూ కలిసి నదిని దాటి అవతల వైపు చేరినాయి.  చెఱకు తోటలోకి నడిచినాయి.

 ఒంటె, తోడేలు చెఱుకుగడలను తింటున్నాయి. తోడేలు దాని పథకం అమలు చేయాలనుకుంది. అది గబగబా చెఱకుగడలను తింది. దాని కడుపు నింపుకుంది. ఒంటె చెఱుకుగడలను తుంచి నెమ్మదిగా తినసాగింది. ఇదే సమయమని తోడేలు ఆలోచించింది. తోడేలు ఒంటె దగ్గరకు వెళ్ళి “మామా!నా కడుపు నిండినది. నాకు ఆహారం తీసుకోగానే నిదురపోయే అలవాటుంది.  నేను మంచి చోటు చూసుకొని నిదురపోతాను. ఆహారము కడుపునిండా తిన్నాక నన్ను నిదురలేపు”అంది. ఇంకో విషయము నేను ఆహారం తీసుకున్నాక పెద్దగా అరవాలి. అలా అరిస్తే కానీ నాకు తిన్న ఆహారము అరిగి నిదురపట్టదు. నీవు నెమ్మదిగా తిని కడుపు నింపుకో అంది. తోడేలు అన్న మాటలు ఒంటెకు వినపడలేదు.  ఒంటె ఒళ్ళు మరచి చెఱకుగడలు తినసాగింది. తోడేలు విషయం మరచిపోయింది.  తోడేలు వెంటనే పెద్దగా అరవటం మొదలుపెట్టింది.  తోట యజమానికి వినపడేలా అరిచింది.  ఆ అరుపులు తోట యజమాని విన్నాడు.

 తోడేళ్ళు తోటను పాడుచేస్తున్నాయని అనుకున్నాడు.  చుట్టు పక్కల పని చేసే కూలీలను కేక వేశాడు.  అంతా కలిసి తోడేలు వెంట పడ్డారు.  కానీ తోడేలు తెలివిగా తప్పించుకుని నది ఒడ్డుకు చేరింది.  వారికి చెఱుకుగడలు తినే ఒంటె కనిపించింది.  అందరూ కలిసి దానిని చితకబాదారు. ఆ దెబ్బలకి ఒంటె ఒళ్ళు హూనమైంది. అది మెల్లిగా నది ఒడ్డుకు చేరింది. దానికి తోడేలు కనిపించింది. ఇది తోడేలు పనే అనుకుంది. దానిని నమ్మినందుకు చింతించింది. తోడేలుకి గుణపాఠం చెప్పాలని గట్టిగా అనుకుంది. తోడేలు ఒంటెను చేరింది. ఎంతో సానుభూతి చూపించింది.  “మామా! ఇలా జరుగుతుంది అనుకోలేదు.  నీ ఒంటి మీద గాయాలు చూస్తుంటే నాకు దు:ఖము ఆగటం లేదు.  ఇంటికి చేరగానే మందు రాస్తాను పద” అంది.  ఒంటె దానివి మోసపు మాటలుగా తెలుసుకుంది.  దాని పీడ విరగడ చేయడానికి ఇదే సమయం అనుకుంది. తోడేలు ఒంటె వీపుపై కూర్చుంది.

ఒంటె వీపు మీద కూర్చున్న తోడేలుకు సంబరంగా ఉంది.  తన చేతిలో ఒంటె మోసపోవడం దానికి చాలా సంతోషం కలిగించింది.  ఒంటె తనను అనుమానించలేదని అనుకుంది. ఒంటె,  నెమ్మదిగా నదిలోకి దిగి లోపలికి వెళ్ళసాగింది.  నది మధ్యలోకి వెళ్ళింది. అక్కడే ఆగింది. “అల్లుడూ! నాకు ఆహారము తినగానే నీటిలో మునిగితే గాని ఆహారము అరగదు. నీవు జాగ్రత్తగా కూర్చో” అంది.  తోడేలుకు అప్పుడు అర్దమైంది.  దానికి చావు దగ్గరపడిందని తెలుసుకుంది. ఈలోగా ఒంటె నీటిలో ఒక్క మునక వేసింది.  ఆ దెబ్బకి తోడేలు నీటిలో కొట్టుకుపోయి చనిపోయింది.

నీతి:  చెరపకురా చెడేవు

9, సెప్టెంబర్ 2012, ఆదివారం

పైకి పోతారని


పైకి పోతారని 

{¡#ásY'
     VŸQdàHŽ kÍ>·sYýË ‹T<ŠÝ $ç>·VŸ²+ ÿ¿£ #ûsTT ¿£&ƒT|ŸÚ MT<Š, eTsà #ûsTT ™|Õ¿ì #áÖ|¾dŸÖï –+³T+~ m+<ŠTÅ£”?

$<‘«]Æ'
     ‡ úÞø—¢ ¿£&ƒT|ŸÚýË¿ì bþÔû ™|Õ¿ì yîÞøÔsÁT n“ #î|Î+<ŠTÅ£”

చిలిపి ప్రశ్న - చిట్టి సమాధానం


చిలిపి ప్రశ్న ` చిట్టి సమాధానం 
<=+>·Ôáq+ m+<ŠTÅ£” #ûXæeÚ?
     n~ eÖ e+Xæ#sÁ+ ¿±‹{ì¼

‹çÂs mý² –+³T+~?
     ¿£fñ¼dï –+³T+~

|ÓsÄÁuó„Ö$T n+fñ @$T{ì?
     |Ó³ MT<РţLsÁTÌ“ #á֝d uó„Ö$T